Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాతాడేపల్లిగూడెంరాజకీయం

జోగి ,అంబటి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నాం….చిటికెన ప్రసాద్

మాజీ మంత్రులు జోగి రమేష్ ,అంబటి రాంబాబు పై కూటమి వర్గాల తీరును గూడెం వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు సోమవారం తాడేపల్లిగూడెం పట్టణ కొబ్బరి తోట ప్రాంతంలో వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు గుండు మోగుల నాగు, వైసిపి మాజీ పట్టణ యూత్ ప్రెసిడెంట్ చిటకన ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగుతుందన్నారు గతంలో రాష్ట్రానికి మంత్రులుగా చేసిన ప్రజా ప్రతినిధులు ఆస్తులపై అల్లరి మూకలు దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు ఏ ప్రభుత్వం పాలనలో ఉన్న ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగాలని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పాడయ్యే విధంగా వ్యవహరించకూడదని అన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారాన్ని తెరమీదకి తీసుకువచ్చి ప్రజల్లో వైసిపి పార్టీని చులకన చేయాలని భావనతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు మన దేశంతో పాటు అనేక దేశాల ప్రజలు అత్యధిక మంది తిరుమల శ్రీనివాసుని కొలుస్తారని వారు మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎటువంటి జంతు అవశేషాలు లడ్డులో లేవని తెలిపారని అన్నారు ఫ్లెక్సీలు వ్యవహారంలో అంబటి ప్రశ్నించడానికి వెళితే ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తే ఆవేశాలు పెరిగి అక్కడ ఉన్న వారిని మాత్రమే దుర్భాషలాడేరు తప్ప చంద్రబాబు నాయుడును కాదని అంబటి కూడా తెలిపినట్టుగా వారు అన్నారు దాడిని ఖండిస్తూ మనం జనారణ్యంలో ఉన్నామే గాని వనరణ్యం లో లేమని అన్నారు మనుషులుగా పుట్టిన మనమంతా మానవత దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉండొచ్చు తరువాత ప్రభుత్వం మారొచ్చు కానీ ఎవరైనా ప్రజా క్షేత్రంలో హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు చిటకన ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలు ఆ పార్టీకి వెన్నుముక అని అంటారని మరి బిసి మంత్రి అయినా జోగి రమేష్ పై దాడినీ తన ఒక బీసీ వర్గానికి చెందిన వాడిగా తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు ప్రతి బీసీ సోదరుడిని కలిసి మేము జోగి రమేష్ కు అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో స, వెలనాటి సత్తిబాబు, కట్ట నాగరాజు,బత్తిని గణేష్,ఉదయ్ భాస్కర్, సుచిత్ర రెడ్డి, కాశీ విశ్వనాథ్ ,బుల్లి ఎంకన్న, చిటకన కృష్ణ, , ఫ్లెక్సీ రాజు లింగారెడ్డి గూడెం వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

APEPDCLఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డివిజన్‌లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

Arnews Telugu

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

Arnews Telugu

నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి

Arnews Telugu

తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

Arnews Telugu

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu